విద్యుత్ వాహన బ్యాటరీ మార్పిడి స్టేషన్ల వివరాలు ఇవ్వండి – కేంద్రాన్ని కోరిన ఆదాల

Clock Of Nellore ( Delhi ) – దేశంలో రాష్ట్రాల వారీగా విద్యుత్ వాహనాల కోసం చిన్న బ్యాటరీ మార్పిడి స్టేషన్ల వివరాలను ఇవ్వాల్సిందిగా నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి ( MP Adala Prabhakar Reddy ) మంగళవారం పార్లమెంట్ లో కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. బ్యాటరీల ఏకరీతి ప్రమాణాల కోసం అమలు చేసిన ప్రయత్నాలు ఏమిటని కూడా అడిగారు. కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి క్రిషన్ పాల్ గుర్జార్ దీనికి సమాధానం ఇస్తూ దేశంలో ప్రస్తుతం 54 బ్యాటరీ మార్పిడి స్టేషన్లు ఉన్నాయని, ఆంధ్రప్రదేశ్ లో రెండు ఉన్నాయని రాతపూర్వకంగా తెలిపారు. బ్యాటరీ మార్పిడి విధానాన్ని అమలు చేయడానికి వాటాదారుల సంప్రదింపుల కోసం నీతి అయోగ్ ఆ విధానాన్ని వెబ్ సైట్ లో అప్లోడ్ చేసిందని పేర్కొన్నారు.

Read Previous

పవన్ సిఎం కాగానే సిపిఎస్ రద్దు – ప్రజాబాటలో కేతంరెడ్డి వెల్లడి

Read Next

ఆర్టీసీలో ఇక మహిళా డ్రైవర్లు… ఎస్సీ మహిళలకే అవకాశం

Leave a Reply

Your email address will not be published.