Clock Of Nellore ( Nellore ) – 10 ఏళ్ల క్రితం తప్పిపోయిన ముగ్గురిని నెల్లూరు జిల్లా పోలీసులు ఇప్పుడు కనుగొన్నారు ( Missing Case ). గుంటూరులో ఉంటున్న వారిని ఇవాళ నెల్లూరుకు తీసుకొచ్చి కుటుంబసభ్యులకు అప్పగించారు. వివరాల్లోకి వెళ్తే… తప్పిపోయారో… వెళ్లిపోయారో… పోలీసులు స్పష్టం చేయలేదు గానీ… పొదలకూరు ప్రాంతాలనికి చెందిన ఎస్. జయంతి అనే 32 సంవత్సరాల మహిళ తన ఇద్దరు పిల్లలతో కలిసి పదేళ్ల క్రితం అంటే 2012లో కనిపించకుండా పోయింది. అప్పట్లో దీనిపై కేసు కూడా నమోదైంది. అప్పటి నుండి నిన్నటి వరకూ వీరి ఆచూకీ పోలీసులకు లభ్యం కాలేదు. మిస్సింగ్ కేసులపై దృష్ఠి సారించిన జిల్లా ఎస్పీ విజయరావు ఈ కేసు ఛేదనకు యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ బృందాన్ని ( Anti-Human Trafficking Team ) రంగంలోకి దించారు. యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ ఎస్సై విజయ్ శ్రీనివాస్ అతని బృందం… 10 ఏళ్ల క్రితం కనిపించకుండా పోయిన జయంతి, ఆమె ఇద్దరు పిల్లలకు గుంటూరులో గుర్తించారు. వారికి కౌన్సిలింగ్ నిర్వహించి ముగ్గుర్ని నెల్లూరుకు తీసుకొచ్చారు. వారి కుటుంబసభ్యులకు అప్పగించారు ( Nellore Police ).