Clock Of Nellore ( Nellore ) – వైసీపి రాష్ట్ర కార్యదర్శి పేర్నాటి శ్యాం ప్రసాద్ రెడ్డి నెల్లూరులో సెబ్ పోలీసు అధికారుల విచారణకు హాజరయ్యారు ( Fake Liqure Case ). 2014లో నమోదైన నకిలీ మద్యం కేసులో ప్రస్తుత మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డితో పాటూ శ్యాం ప్రసాద్ రెడ్డి కూడా నిందితునిగా ఉన్నారు. ఆ కేసు విచారణ సాగుతుంది. ఈ నేపద్యంలో నెల్లూరు నీలగిరి సంఘంలో ఉన్న స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ బ్యూరో పోలీస్ స్టేషన్ అధికారులు శ్యాం ప్రసాద్ రెడ్డిని విచారణకు రావాలని ఫోన్ లో కోరారు. నోటీసులు లేకుండా ఎలా వస్తానంటూ శ్యాం ప్రసాద్ రెడ్డి అభ్యంతరం చెప్పగా బైండోవర్ చేసుకుంటామని అన్నారని, అందుకే విచారణకు హాజరయ్యానని శ్యాం ప్రసాద్ రెడ్డి అన్నారు. శ్యాం ప్రసాద్ రెడ్డి ఈ ఉదయం స్టేషన్ కు వెళ్లగా అక్కడ అధికారులెవ్వరూ లేకపోవడంతో కొద్ది సేపు వేచిచూసి వెళ్లిపోయారు. ఈ సందర్భంగా పోలీసుల తీరుపై శ్యాం ప్రసాద్ రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. నోటీసులు ఇవ్వకుండా ఎలా విచారణకు పిలుస్తారని ప్రశ్నించారు. కేసు విచారణ సిఐడి పరిధిలో ఉంటే సెబ్ పోలీసులు ఎలా పిలుస్తారన్నారు. ఇదే కేసులో మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి కూడా నిందితులుగా ఉన్నారని, వారిని విచారణకు పిలవగలరా అని ప్రశ్నించారు. తనపై పోలీసులు అక్రమంగా ప్రవర్తిస్తున్నారని, ఈ విషయాన్ని కోర్టులో తేల్చుకుంటానని స్పష్టం చేశారు.
