ఈయన ఎవరో తెలిస్తే షాక్ అవుతారు : తర్వాత ఏం జరిగిందంటే ?

Clock Of Nellore ( Nellore ) – అవును ఈయన ఎవరో తెలిస్తే నిజంగానే షాక్ అవుతారు. ఖరీదైన కారు, కార్యాలయం, చుట్టూ ప్రభుత్వ సిబ్బందితో నిత్యం బిజీగా ఉండాల్సిన ఈయన కొద్ది సేపు సామాన్యుడిగా మారిపోయాడు. మాస్క్ ధరించి ఎవరో ఏమీ తెలియనట్లు కూరగాయల మార్కెట్ కు వెళ్లి బేరం చేసీ మరీ కాయగూరలు కొన్నారు. తర్వాతే తన అధికారాన్ని ఉపయోగించి ప్రభుత్వ సిబ్బందిపై చర్యలకు ఉపక్రమించారు. ఆయనే నెల్లూరు జిల్లా జాయింట్ కలెక్టర్ రోనంకి కూర్మనాథ్… ఆదివారం ఉదయం సాధాసీదాగా టీ షర్టు ధరించి నెల్లూరులోని ఏసి కూరగాయల మార్కెట్ కు సంచితో వెళ్లారు. ప్రతీ షాపుకు తిరుగుతూ కూరగాయల ధరలను తెలుసుకుంటూ కొన్ని కొన్నారు. ఎవరో ఏంటో తెలియని మార్కెట్ వ్యాపారస్తులు తమదైన శైలిలో అధిక ధరలు చెప్పగా అదే ధరకు జాయింట్ కలెక్టర్ కూర్మనాథ్ కొనుగోలు చేశారు. తర్వాత అక్కడే ఉన్న ధరల పట్టికను పరిశీలించగా ఆ పట్టీకి, కొనుగోలు చేసిన ధరకు భారీగా తేడా ఉంది. వెంటనే ఆయన మార్కెటింగ్ శాఖ సిబ్బందిపై చర్యలకు ఉపక్రమించారు. మార్కెట్ కార్యదర్శికి షోకాజ్ నోటీసు జారీ చేశారు. అలాగే సూపర్ వైజర్ రియాజ్ కు మెమో జారీ చేశారు. అధిక ధరలకు కూరగాయలు విక్రయిస్తున్నారని దానిపై చర్యలు చేపట్టాలని మార్కెటింగ్ ఏడిని ఆదేశించారు.

Read Previous

నెల్లూరు జడ్పీ సర్వసభ్య సమావేశం : రోడ్ల దుస్థితిపై ఏకరువు పెట్టిన ఎమ్మెల్యేలు

Read Next

వైసీపి ఎమ్మెల్యేలను సిఎం డమ్మీలుగా మార్చాడు : రామకృష్ణ ఆరోపణ

Leave a Reply

Your email address will not be published.