Clock Of Nellore ( Nellore ) – పూర్తిగా నెల్లూరు నటీనటులతో రూపొందిన చిత్రం “మద్రాస్ బస్టాండ్”. ప్రొడక్షన్ పూర్తి చేసుకుని వచ్చే నెల ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా చిత్రం ప్రమోషన్స్ లో భాగంగా చిత్ర యూనిట్ నెల్లూరు నగర మేయర్ స్రవంతిని కలవడం జరిగింది. ఈ సందర్భంగా మేయర్ స్రవంతి మాట్లాడుతూ మద్రాస్ బస్టాండ్ చిత్రం మన నెల్లూరీయులకు గర్వకారణంగా నిలవాలని, చిత్రం విజయవంతంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మంచి పేరు తెచ్చుకోవాలని ఆకాంక్షించారు. ప్రధాన పాత్రలో నటించిన షేక్ షంషుద్దీన్, చిత్ర నిర్మాత మల్లేపల్లి రఘుకి, చిత్ర కథానాయక రేణు ప్రియా, హీరో సాయి జామ్, డైరెక్టర్ జనార్ధన్, చిత్ర బృందం అందరికీ శుభాకాంక్షలు తెలియజేసారు.
