నెల్లూరు అపోలో హాస్పిటల్ లో పెయిన్ మేనేజ్ మెంట్ క్లినిక్… నొప్పులకు ఇక శెలవు

  • దీర్ఘకాలిక నొప్పుల పరిష్కారానికి అపోలో ప్రత్యేక సెంటర్
  • నెల్లూరులో ప్రారంభమైన అపోలో పెయిన్ మేనేజ్ మెంట్ క్లినిక్
  • అన్నీ రకాల నొప్పులకు ఆపరేషన్ లేకుండా చికిత్స
  • డాక్టర్ పి.రాజమోహన్ రెడ్డి పర్యవేక్షణలో చికిత్సలు
  • నెల్లూరు జిల్లా వాసులకు వరంలా అపోలో పెయిన్ మేనేజ్ మెంట్ క్లినిక్

Clock Of Nellore ( Nellore ) – అన్నీరకాల వ్యాధులకు నాణ్యమైన వైద్యసేవలు అందిస్తూ, ఎంతో మందికి ప్రాణం పోస్తున్న నెల్లూరు అపోలో స్పెషాలిటీ హాస్పిటల్లో మరో సరికొత్త వైద్యసేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఒత్తిడిమయమైన జీవితంలో ఎంతో మంది దీర్ఘకాలిక నొప్పులతో బాధపడుతూ ఉంటారు. అటువంటి వారి కోసం అపోలో పెయిన్ మేనేజ్ మెంట్ క్లినిక్ కు శ్రీకారం చుట్టింది. నెల్లూరు లోని అపోలో స్పెషాలిటీ ఆసుపత్రిలో జరిగిన పత్రికా విలేకరుల సమావేశంలో ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీరామ్ సతీష్, ప్రముఖ ఇంటర్వెన్షనల్ పెయిన్ స్పెషలిస్ట్ డాక్టర్ రాజమోహన్ రెడ్డి లు మాట్లాడారు. ప్రముఖ ఇంటర్వెన్షనల్ పెయిన్ స్పెషలిస్ట్ డాక్టర్ రాజమోహన్ రెడ్డి ఆధ్వర్యంలో అన్నీ రకాల నొప్పులకు ఆపరేషన్ లేకుండా చికిత్సలు అందిస్తున్నామన్నారు.

దీర్ఘకాలిక నొప్పులతో బాధపడేవారు వారి దైనందిన జీవితంలో అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని, అటువంటి దీర్ఘకాలిక నొప్పులకు చెక్ పెట్టేందుకు అపోలో హాస్పిటల్ ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకువచ్చిందని పేర్కొన్నారు. ఈ అపోలో పెయిన్ మేనేజ్ మెంట్ క్లినిక్ లో కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు, సయాటికా, బ్యాక్ పెయిన్, నరాల నొప్పులు, తలనొప్పి, మెడ నొప్పి, బుజం నొప్పి, కాన్సర్ నొప్పి, కండరాల నొప్పులతో పాటూ అన్నీ రకాల నొప్పులకు ఆపరేషన్ లేకుండా అత్యాధునిక ఇంటర్వెన్షనల్ ఇంజెక్షన్ల తో చికిత్సను అందించడం జరుగుతుందని వివరించారు. ఈ ఇంటర్వెన్షనల్ ఇంజెక్షన్లు అత్యాధునిక పరికరాలను వినియోగించి చేయడం వలన దుష్పలితాలు తక్కువగా ఉండి సమర్థవతంగా పనిచేస్తాయి. ఈ చికిత్సా విధానంలో ఆపరేషన్ అవసరం లేదని, అడ్మిషన్ అవసరం లేదని, త్వరితగతిన నొప్పి తగ్గుతుందని, దీర్ఘకాలికంగా విశ్రాంతి అవసరం లేదన్నారు. కర్చు తక్కువ, దీర్ఘకాలికంగా మందులు వాడవలసిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఈ అవకాశాన్ని నెల్లూరు జిల్లా వాసులు సద్వినయోగం చేసుకోవాలని వారు కోరారు.

Read Previous

పవన్ కళ్యాణ్ సిఎం కాగానే ఉద్యోగ ఖాళీలు భర్తీ – కేతంరెడ్డి వెల్లడి

Read Next

నన్ను టచ్ చేసే దమ్ముందా ? : వారి కుట్రలు సాగవని హెచ్చరించిన కోటంరెడ్డి

One Comment

  • Pls provide appointment for Gout problem

Leave a Reply

Your email address will not be published.