Clock Of Nellore ( Nellore ) – నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 12 వ డివిజన్ వావిలేటి పాడు పరిసర ప్రాంతాల్లోని స్థానిక సమస్యలను నాయకులు, ప్రజల సమిష్టి కృషితో పరిష్కరించేందుకు ప్రణాలికలు రూపొందిస్తున్నామని వై.సీ.పీ రాష్ట్ర కార్యదర్శి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, నగర మేయర్ స్రవంతి పేర్కొన్నారు. వావిలేటిపాడు సచివాలయం ప్రాంగణంలో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో స్థానిక ప్రజలు, నాయకులతో వై.సీ.పీ రాష్ట్ర కార్యదర్శి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, మేయర్ స్రవంతి భేటి అయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్థానికంగా ఉన్న సమస్యలను సచివాలయం కార్యదర్శులు, వాలంటీర్ల దృష్టికి తీసుకువచ్చి వీలైనంత త్వరగా పరిష్కారం పొందాలని సూచించారు. డివిజన్ వ్యాప్తంగా జరుగుతున్న అభివృద్ధి పనులన్నీ అత్యంత పారదర్శకంగా జరిగేలా స్థానిక ప్రజలు, నాయకులు పర్యవేక్షించాలని తెలిపారు. అభివృద్ధి పనులన్నీ సూచించిన సమయానికి పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెచ్చేలా ప్రతి ఒక్కరూ సహకరించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో వై.సీ.పీ నాయకులు ప్రభాకర్ రెడ్డి, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
