Clock Of Nellore ( Nellore ) – జనసేన పార్టీని నమ్ముకున్న ప్రతీ కార్యకర్తకూ అండగా ఉంటామని, వారి కుటుంబానికి భరోసాగా నిలుస్తామని జనసేన పార్టీ నేత కేతంరెడ్డి వినోద్ రెడ్డి స్పష్టం చేశారు. నెల్లూరులో ఆయన పార్టీ కార్యకర్తలకు సభ్యత్వ కిట్లను పంపిణీ చేసి అనంతరం పవనన్న ప్రజాబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. నగరంలోని మైపాడు రోడ్డు సత్యనారాయణ పురంలో ఆదివారం పర్యటించారు. ముందుగా స్థానికంగా ఏర్పాటు చేసిన దిమ్మె వద్ద జనసేన పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పార్టీ క్రియాశీలక సభ్యులకు సభ్యత్వ కిట్లను అందజేశారు. తరువాత శ్రీనివాస నగర్ 3వ వీధిలో వినోద్ రెడ్డి ఇంటింటికి వెళ్లి స్థానికులను పలకరించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రానున్న ఎన్నికల్లో జనసేన పార్టీని దీవించాలని కోరారు.
