నెల్లూరులో “10K” రన్ ఫర్ హెల్త్… ప్రారంభించిన ఎస్పీ విజయరావు

Clock Of Nellore ( Nellore ) – నెల్లూరులో జిల్లా పోలీసు శాఖ “10K” రన్ ఫర్ హెల్త్ కార్యక్రమాన్ని చేపట్టింది. నగరంలోని పోలీసు కవాతు మైదానం నుండి ఆరంభమైన ఈ రన్ ను జిల్లా ఎస్పీ విజయరావు జెండా ఊపి ప్రారంభించారు. అన్నీ విభాగాల పోలీసు అధికారులు, సిబ్బంది మొత్తం 300 మంది ఈ రన్ లో పాల్గొన్నారు. పోలీసు కాలనీ వరకూ సాగిన ఈ రన్ లో ఎస్పీ విజయరావు కూడా ఉత్సాహంగా పాల్గొన్నారు. అదనపు ఎస్పీలు హిమవతి, చౌడేశ్వరి ఇతర అధికారులు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఆరోగ్యానికి ప్రధమ కారణం శారీరక దారుఢ్యమేనని, నిరంతర వ్యాయామం ఆరోగ్యకరమైన కుటుంబానికి దోహదపడుతుందని అభిప్రాయపడ్డారు. ఈ రన్ లో ప్రతిభ కనబర్చిన కానిస్టేబుల్ పోలి నాయుడు, శ్రీహరి, బాల సుబ్రమణ్యం మహిళా కానిస్టేబుళ్లు చందన, మౌనిక, మహిళా ఎస్సై లతీఫున్నిసాలకు ఎస్పీ జ్ఞాపికలను అందజేసి ఉత్సాహ పరిచారు.

Read Previous

ఆత్మకూరు ఉప ఎన్నిక : బిజేపి అభ్యర్ధి సహా 8 మంది నామినేషన్లు

Read Next

జగన్ ప్రభుత్వంలో ఉద్యోగులు, పెన్షనర్లకు తిప్పలే – కేతంరెడ్డి విమర్శ

Leave a Reply

Your email address will not be published.