Clock Of Nellore ( Yerpedu ) – వైసీపి నేత, నెల్లూరు నగర మేయర్ స్రవంతి భర్త జయవర్ధన్ నెల్లూరు నుండి తిరుమలకు తలపెట్టిన పాదయాత్ర ఏర్పేడుకు చేరుకుంది. అస్వస్థతకు గురైన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పూర్తిగా కోలుకుంటే తిరుమలకు నడిచి వస్తానని ఆయన మొక్కుకున్నారు. ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి పూర్తిగా కోలుకున్న నేపద్యంలో మొక్కు తీర్చుకునేందుకు నాలుగు రోజుల క్రితం నెల్లూరు నుండి కాలినడకన తిరుమలకు బయలు దేశారు. నాలుగవ రోజు అయిన శుక్రవారం ఆయన పాదయాత్ర ఏర్పేడుకు చేరుకుంది. ప్రతీ ప్రాంతంలో జయవర్ధన్ కు స్థానికి వైసీపి నేతలు స్వాగతం పలికి కోటంరెడ్డి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
