Clock Of Nellore ( Nellore ) – నెల్లూరులో ఇటీవల వరుసగా జరుగుతున్న నేరాలపై జిల్లా ఎస్పీ విజయరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే నగరంలోని చిన్నబజారు పోలీస్ స్టేషన్ సిఐ వీరేంద్రబాబును విధుల నుండి తప్పించగా… తాజాగా ఆరు మంది నేరస్తులపై పిడి యాక్టును ప్రయోగించారు. హత్య, హత్యాయత్నాలు, ఇతర కేసులలో నిందితులైన వారిపై పిడి యాక్టు నమోదు చేసి అవసరమైతే జిల్లా బహిష్కరణ చేపడతామని హెచ్చరించారు. నెల్లూరుకు చెందిన దేవళ్ల ప్రకాష్, షేక్ ఆసిఫ్, లక్ష్మీశెట్టి సాయి తేజ, షేక్ ఖలీల్, అద్వాన్నపు నవీన్ కుమార్, గూడూరు పట్టణానికి చెందిన అరవ వినయ్ కుమార్ అనే ఆరుమందిపై పిడి యాక్టు నమోదు చేసినట్లు ఎస్పీ విజయరావు వెల్లడించారు. ఈ యాక్టు వల్ల వారు జైలు జీవితానికే పరిమితమవుతారన్నారు. పద్దతి మార్చుకోకపోతే జిల్లా బహిష్కరణ కూడా చేస్తామని ఎస్పీ హెచ్చరించారు.