Clock Of Nellore ( Nellore ) – కాబోయే రాజ్యసభ సభ్యులు బీదా మస్తాన్ రావుకు శుభాకాంక్షలు తెలియజేశారు… నూర్ బాషా ముస్లిం సంక్షేమ సంఘం నెల్లూరు జిల్లా అధ్యక్షులు షేక్ కాలేషా. శుక్రవారం నెల్లూరులో వారు బీదా మస్తాన్ రావును ( MP Beedha Masthan Rao ) కలిశారు. శాలువాతో సత్కరించి పుష్పగుచ్చం అందజేశారు. రాజ్యసభకు ఎంపిక కావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. పేదలకు ఎప్పుడూ సహాయకారిగా ఉండే బీదా మస్తాన్ రావు భవిష్యత్తులో మరిన్ని పదవులు అధిరోహించాలని కాంక్షించారు. ఈ కార్యక్రమంలో నూర్ బాషా ముస్లిం సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షులు షేక్ మీరా సాహెబ్, ఉపాధ్యక్షులు షేక్ ఇబ్రహీం, జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ అబ్ధుల్ సలీం, కమిటి సభ్యులు షేక్ రహంతుల్లా పాల్గొన్నారు.
