Clock Of Nellore ( Kaligiri ) – నెల్లూరు జిల్లా కలిగిరి మండలం, పొలంపాడు అటవీ ప్రాంతంలో గుర్తు తెలియని మృతదేహాన్ని గుర్తించారు పోలీసులు. పశువుల కాపరి సమాచారంతో అక్కడకు చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. మృతదేహం గుర్తు పట్టలేని విధంగా ఉంది. మృతదేహంపై చర్మం మొత్తం తొలగి ఎముకల గూడుగా ఉండటాన్ని పోలీసులు గుర్తించారు. చివరకు వివిధ మార్గాల ద్వారా దర్యాప్తు చేపట్టి స్థానిక చిన్న అన్నలూరుకు చెందిన బండ్ల ధనుంజయ గా ధృవీకరించారు. ఈనెల 16వ తేదీనా ధనుంజయ కనబడటం లేదంటూ వారి కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేసి ఉన్నారు. 39 సంవత్సరాలు వయస్సు ఉన్న ధనుంజయ చిన్న అన్నలూరు గ్రామంలో విద్యుత్ శాఖ అసిస్టెంట్ లైన్ మెగా గా పనిచేస్తున్నాడు. అతని భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. కేసు నేపద్యంలో కుటుంబసభ్యులను ఘటనా స్థలానికి రప్పించగా వారు ధృవీకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్య చేసుకున్నాడా లేదా ఎవరైనా హత్య చేశారా అనేది దర్యాప్తులో తేలాల్సి ఉంది.