నెల్లూరులో రాష్ట్ర గవర్నర్… స్వాగతం పలికిన అధికారులు

Clock Of Nellore ( Nellore ) – విక్రమ సింహపురి విశ్వ విద్యాలయం స్నాతకోత్సవంలో పాల్గొనేందుకు ప్రత్యేక హెలికాప్టర్ లో నెల్లూరుకు విచ్చేసిన రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు స్వాగతం పలికారు. యూనివర్శిటీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్ద జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు, జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ ఆనం అరుణమ్మ, యూనివర్శిటీ వైస్- ఛాన్సలర్ సుందరవల్లి, రిజిస్ట్రార్ ఎస్వీ కృష్ణారెడ్డి, జాయింట్ కలెక్టర్ హరేంధిర ప్రసాద్, నెల్లూరు కమిషనర్ జాహ్నవి, ఎస్పీ విజయరావు, అదనపు ఎస్పీ హిమవతి, కావలి ఆర్డీఓ శీనానాయక్, ఆత్మకూరు ఆర్డీఓ బాపిరెడ్డి తదితరులు గవర్నర్ కు స్వాగతం పలికారు.

Read Previous

మెడికవర్ ఆధ్వర్యంలో థైరాయిడ్ అవగాహన పోటీలు…

Read Next

పారిశుద్ధ్యంపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టండి – కమిషనర్ జాహ్నవి

Leave a Reply

Your email address will not be published.