తమిళనాడులో NCAP సదస్సు… పాల్గొన్న నెల్లూరు మేయర్ స్రవంతి

Clock Of Nellore ( Chennai ) – తమిళనాడులో జరిగిన కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ మరియు తమిళనాడు ప్రభుత్వం కాలుష్య నియంత్రణ మండలి బోర్డుల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దక్షిణాది రాష్ట్రాల సేన్సిటైజేషన్ కం రివ్యూ వర్క్ షాప్ “నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాం (NCAP) & XV-FC మిలియన్ ప్లస్ సిటీస్ ఫండ్ (XV-FC MPCCF)” సదస్సులో నెల్లూరు నగరపాలక సంస్థ మేయర్ స్రవంతి శనివారం పాల్గొన్నారు. చెన్నై లోని ITC గ్రాండ్ చోళ వేదికలో రెండు రోజుల పాటు జరగనున్న ఈ వర్క్ షాప్ లో తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అండమాన్ నికోబార్, లక్ష ద్వీప్, పాండిచ్చేరి, డయ్యు & డామన్, దాద్రా & నగర్ హవేలీ రాష్ట్రాలకు చెందిన పలువురు ప్రతినిధులు పాల్గొంటున్నారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ( NGT ) ఆదేశాల మేరకు 2024 సంవత్సరం నాటికి వాయు కాలుష్యం 20 – 30 % వరకు తగ్గించాలని ప్రతిపాదించే నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాం (NCAP) నిబందనలను సవరించే దిశగా సదస్సులో ప్రతినిధులు నిర్ణయాలు తీసుకోనున్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పుల శాఖామాత్యులు భూపేందర్ యాదవ్, అడిషనల్ సెక్రటరీ అఫ్ ఇండియా నరేష్ పాల్ గంగ్వర్, తమిళనాడు పర్యావరణ మరియు కాలుష్య నియంత్రణ శాఖా మంత్రి శివ వి.మెయ్యనాథన్, కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం మరియు ప్రజా పంపిణీ మరియు పర్యావరణం, అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రి వర్యులు అశ్విని కుమార్ చౌబే, కేంద్ర పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పుల సెక్రటరీ లీలా నందన్ మరియు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

Read Previous

ఆగస్టు నెలాఖరుకల్లా ఫ్లై ఓవర్ పనులు పూర్తి : మాజీ మంత్రి అనీల్ వెల్లడి

Read Next

మంత్రి కాకాణికి అరుదైన గౌరవం… తాను చదివిన కళాశాలలోనే సత్కారం

Leave a Reply

Your email address will not be published.