మాదరాజు గూడూరులో గడప గడపకు కార్యక్రమాన్ని ప్రారంభించిన కోటంరెడ్డి

Clock Of Nellore ( Nellore Rural ) – గడచిన 40 రోజులుగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహిస్తున్న ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి శుక్రవారం మాదరాజు గూడూరులో పర్యటించారు. స్థానికంగా ఉన్న పల్లిపాళెం గ్రామం నుండి మొదలైన ఈ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి… ఇంటింటికి వెళ్లి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా లేదా అని అడిగారు. పథకాలు అందకపోతే ఎందుకు అందలేదో అడిగి అధికారులకు వారి ఇబ్బందులను తెలియజేసి త్వరగా వారికి పథకాలు అందే విధంగా కృషి చేయాలని ఆదేశించారు. ఓ నివాసంలో వ్యక్తి అనారోగ్యంతో బాధపడుతుండా ఆయన్ను పలకరించి తానున్నానని భరోసా ఇచ్చారు. పర్యటనకు వెళ్లిన శ్రీధర్ రెడ్డికి స్థానికులు ఘనంగా స్వాగతం పలికారు.

Read Previous

బయట చెత్త వేస్తే జరిమానా విధించండి – అధికారులకు కమిషనర్ ఆదేశం

Read Next

ఈనెల 24న గవర్నర్ నెల్లూరు పర్యటన – ఏర్పాట్లు పర్యవేక్షించిన జాయింట్ కలెక్టర్

Leave a Reply

Your email address will not be published.