Clock Of Nellore ( Kavali & Nellore ) – రాష్ట్ర శాసనసభ ఉప సభాపతి కోన రఘపతి గురువారం నెల్లూరుజిల్లాలో పర్యటించారు. తిరుమలకు వెళ్తూ మార్గం మధ్యలో నెల్లూరులో బస చేశారు. ముందుగా కావలి సమీపంలోని బోగోలు మండలం, కొండ బిట్రగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. అక్కడ పూజలు నిర్వహించారు. అనంతరం నెల్లూరుకు చేరుకున్నారు. నగరంలోని రోడ్లు భవనాల శాఖ అతిధి గృహంలో కాసేపు సేద తీరి అక్కడి నుండి తిరుమలకు బయలు దేరి వెళ్లారు. నెల్లూరుకు వచ్చిన ఉప సభాపతికి కావలి, నెల్లూరు ఆర్డీఓలు శీనానాయక్, కొండయ్యలు స్వాగతం పలికారు.
