Clock Of Nellore ( Nellore Rural ) – “జగనన్న మాట – గడప గడపకు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి బాట” పేరుతో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ( YCP Mla KotamReddy Sridhar Reddy ) కొనసాగిస్తున్న కార్యక్రమం 31వ రోజుకు చేరుకుంది. 31వ రోజైన బుధవారం ములుమూడి ( Mulumudi ) గ్రామంలో పర్యటించారు కోటంరెడ్డి. గత రాత్రి అదే గ్రామంలోని గిరిజన కాలనీకి చెందిన యాకసిరి రమణయ్య ఇంట్లో బస చేసిన కోటంరెడ్డి ఇవాళ ఉదయం 7 గంటల నుండి తిరిగి అదే గ్రామంలోని మిగిలిన ప్రాంతాల్లో పర్యటించారు. కార్యక్రమంలో భాగంగా గడప గడపకూ వెళ్లి ప్రజలతో మాట్లాడారు. ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. ఇతర సమస్యలను అడిగి వాటి పరిష్కారానికి హామీ ఇచ్చారు. ములుమూడిలో ఇప్పటి వరకూ 6.27 కోట్ల రూపాయతో సంక్షేమ పథకాలు అందించామని, 3.49 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు చేశామని వివరించారు. మిగిలిన పనులు త్వరలోనే పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.
