Clock Of Nellore ( Gudur ) – తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని DRW కళాశాల వద్ద ఇంటర్ విద్యార్ధి ఏకొల్లు వెంకట సతీష్ ( 18 ) గుండెపోటుతో మృత్యువాత పడ్డాడు. నెల్లూరుజిల్లా సైదాపురంకు చెందిన సతీష్ ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. గూడూరులోని DRW కళాశాలలో విద్యార్ధి పరీక్షలు రాస్తున్నాడు. మంగళవారం ఉదయం యధావిధిగా పరీక్షా కేంద్రానికి చేరుకున్న వెంకట సతీష్ కు ఒక్క సారిగా గుండెపోటు రాగా అక్కడే కుప్పకూలాడు. కళాశాల సిబ్బంది గమనించి సతీష్ ను హాస్పిటల్ కు తరలిస్తుండగా మార్గం మధ్యలోనే తుది శ్వాస విడిచాడు. గూడూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరో వైపు 18 ఏళ్ల యువకుడికి గుండెపోటు రావడం ఏంటని అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. యువకుడికి మరేమైనా ఆరోగ్య సమస్యలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

