Clock Of Nellore ( Nellore ) – రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు సోమవారం నెల్లూరు పర్యటనకు విచ్చేశారు. ముందుగా ఆయన ఆర్ అండ్ బి అతిధి గృహానికి చేరుకోగా జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు ఆయకు స్వాగతం పలికి పుష్పగుచ్చాలు అందజేశారు. జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు, ఎస్పీ విజయరావు, జలవనరుల శాఖ అధికారులు మంత్రిని మర్యాద పూర్వకంగా కలిశారు. అలాగే వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామ నారాయణరెడ్డి, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, నగర మేయర్ స్రవంతి, వైసీపి రాష్ట్ర కార్యదర్శి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ ఆనం అరుణమ్మ, వైసీపి రాష్ట్ర కార్యదర్శి ఆనం విజయకుమార్ రెడ్డి, నెల్లూరు ఎంపి ఆదాల ప్రభాకర్ రెడ్డి, విజయ డైరీ ఛైర్మైన్ కొండ్రెడ్డి రంగారెడ్డి, కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి తదితరులు మంత్రి అంబటిని మర్యాద పూర్వకంగా కలిసి పుష్ప గుచ్ఛం అందజేశారు.
