Clock Of Nellore ( Podalakuru ) – రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి తండ్రి కాకాణి రమణారెడ్డి మొదటి వర్ధంతి వారి స్వస్థలమైన నెల్లూరుజిల్లా పొదలకూరు మండలం, తోడేరు గ్రామంలో శనివారం జరిగింది. ఈ సందర్బంగా మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డితో సహా వారి కుటుంబసభ్యులు రమణారెడ్డి చిత్రపటానికి నివాళి అర్పించారు. అలాగే సమాధి వద్ద కూడా అంజని ఘటించారు. కాకాణి రమణారెడ్డి పై రూపొందించిన ఆడియో గీతానికి సంభందించిన సిడిని కుమార్తెలు ఆవిష్కరించారు. ఈ వర్ధంతి కార్యక్రమానికి మాజీ మంత్రి, వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామ నారాయణరెడ్డి, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, నెల్లూరు ఎంపి ఆదాల ప్రభాకర్ రెడ్డి తదితరులు హాజరయ్యి రమణారెడ్డి చిత్ర పటానికి నివాళి అర్పించారు.
