పలు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన సిటీ ఎమ్మెల్యే అనీల్…

Clock Of Nellore ( Nellore ) – నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనీల్ కుమార్ యాదవ్ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శుక్రవారం శ్రీకారం చుట్టారు. 5వ డివిజన్ లోని వైకుంఠ పురంలో నాడు – నేడు ద్వారా 53 లక్షలతో చేపట్టనున్న స్కూల్ అభివృద్ధి పనులను ప్రారంభించారు. అలాగే బోడిగాడితోటలో 1.92 కోట్లతో ఏర్పాటు చేసిన గ్యాస్ ఆధారిత పార్ధీవ దేహాల దహన భవనాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు ఓబిలి రవిచంద్ర, దామవరపు రాజశేఖర్, వేలూరు మహేష్, నీలి రాఘవరావు తదితరులు పాల్గొన్నారు.

 

Read Previous

క్రైం అదనపు ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన చౌడేశ్వరి…

Read Next

720 మంది విద్యార్ధులకు అండగా నిలిచిన ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి

Leave a Reply

Your email address will not be published.