Clock Of Nellore ( Chittamuru ) – వేగంగా పరుగులు తీస్తున్న బైక్ లో ఒక్కసారిగా నిప్పులు చెలరేగాయి. గమనించిన చోదకుడు బైక్ ను ఆపి పక్కకు వెళ్లిపోవడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. తిరుపతి జిల్లా గూడూరు పరిధిలోని చిట్టమూరు మండలం, కలుగుర్తిపాడు సమీపంలో ఈ ఘటన జరిగింది. యాకసిరి గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు హీరో హోండా బైక్ పై సూళ్లూరుపేటకు వెళ్లి తిరిగి వస్తుండగా ఎండ వేడి అధికంగా ఉండటం, ట్యాంక్ వద్ద సన్నగా పెట్రోల్ లీక్ కావడంతో ఒక్క సారిగా మంటలు చెలరేగాయి. గమనించిన ఇద్దరు బైక్ అక్కడే ఆపేసి దూరంగా వెళ్లిపోయారు. నిముషాల్లో బైక్ మంటల్లో కాలిపోయింది.
Tags: Bike Fire Heavy Summer