ముగిసిన ఉప రాష్ట్రపతి నెల్లూరు పర్యటన – వీడ్కోలు పలికిన అధికారులు

Clock Of Nellore ( Venkatachalam ) – భారత ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు నెల్లూరు పర్యటన ముగిసింది. నాలుగు రోజుల పర్యటన నిమిత్తం ఈనెల 26వ తేదీన వెంకయ్యనాయుడు నెల్లూరుకు విచ్చేశారు. నెల్లూరులో పూర్తి స్థాయిలో ఆధునీకరించిన ఆలిండియా రేడియో కేంద్రాన్ని ప్రారంభించారు. అలాగే అల్లూరులో దేవిరెడ్డి శారద ఛారిటబుల్ ట్రస్ట్ ను కూడా ఆరంభించి, స్వర్ణ భారత్ ట్రస్ట్ లో ఉచిత వైద్య శిభిరాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమాలు పూర్తి కావడంతో ఇవాళ ఉదయం ఢిల్లీకి బయలు దేరి వెళ్లారు. స్వర్ణ భారత్ ట్రస్ట్ లోనే బస చేసిన వెంకయ్య నాయుడు వెంకటాచలం రైల్వే స్టేషన్ నుండి ప్రత్యేక రైలులో రేణిగుంటకు బయలు దేరి వెళ్లారు. రేణిగుంట చేరుకుని అక్కడి నుండి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళతారు. మరో వైపు వెంకయ్య నాయుడుకు వెంకటాచలం రైల్వే స్టేషన్ లో జిల్లా అధికారులు వీడ్కోలు పలికారు. జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు, ఎస్పీ విజయరావు, అదనపు ఎస్పీ వెంకట రత్నం, జాయింట్ కలెక్టర్ హరేంధిర ప్రసాద్ తదితరులు వీడ్కోలు పలికారు.

Read Previous

బుజబుజ నెల్లూరులో ఆనంకు బ్రహ్మరథం – కార్యాలయం ప్రారంభం

Read Next

అధికారుల నిర్లక్ష్యం… విద్యార్థికి శాపం…

Leave a Reply

Your email address will not be published.