Clock Of Nellore ( Nellore ) – పదవ తరగతి పరీక్షలను ఎలాంటి అవకతవకలకు తావులేకుండా కట్టుదిట్టంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు అధికారులను ఆదేశించారు. బుధవారం నెల్లూరు నగర శివారు బుజుబుజ నెల్లూరులోని ప్రభుత్వ పాఠశాలలో పరీక్షల తీరును ఆయన పరిశీలించారు. అలాగే జిల్లా రెవెన్యూ అధికారిణి వెంకట నారాయణమ్మ కూడా పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశారు. నెల్లూరు నగరంలోని రామలింగాపురం నారాయణ ఇంగ్లీష్ మీడియం ఉన్నత పాఠశాల, అన్నమయ్య కూడలి లోని ఓవెల్ ఇంగ్లీష్ మీడియం ఉన్నత పాఠశాల, బివి నగర్ లోని కె ఎన్ ఆర్ మునిసిపల్ ఉన్నత పాఠశాల, మాగుంట లేఅవుట్ లోని ఎస్ ఆర్ కె ఇంగ్లీష్ మీడియం ఉన్నత పాఠశాలలో ఏర్పాటుచేసిన పదవ తరగతి పరీక్షా కేంద్రాలను జిల్లా రెవెన్యూ అధికారిణి బుధవారం తనిఖీ చేశారు. వాటిలో ఏర్పాటుచేసిన ప్రధమ చికిత్స కేంద్రాలను కూడా డిఆర్ఓ పరిశీలించారు.


