Clock of nellore ( Sangam ) – మేకపాటి గౌతమ్ రెడ్డి సంగం బ్యారేజి నిర్మాణ పనులను మూడు నెలల్లో పూర్తి చేసి ముఖ్యమంత్రి జగన్ చేతులమీదుగా ప్రారంభోత్సవం చేస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు. ఆదివారం మంత్రి గోవర్ధన్ రెడ్డి, ఇరిగేషన్ శాఖ అధికారులతో కలసి సంగం బ్యారేజి నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించి, బ్యారేజి నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేసేలా పనులు వేగవంతం చేయాలని అధికారులను, సంబందిత నిర్మాణ ఏజెన్సీ ప్రతినిధులను ఆదేశించారు. ఈ సంధర్భంగా మంత్రి గోవర్ధన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ సంగం బ్యారేజి నిర్మాణం జిల్లా ప్రజానీకానికి ఒక కల లాంటిదని, రానున్న మూడు నెలల్లో పూర్తి చేసి ముఖ్యమంత్రి చేతులమీదుగా ప్రారంభించుకోవడం జరుగుతుందన్నారు.

ఇప్పటివరకు 95 శాతం పనులు పూర్తికావడం జరిగిందని మంత్రి వివరించారు. ఈ ప్రాంతానికి చెందిన దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఈ రోజు మద్య లేకపోయినా, ఈ బ్యారేజి నిర్మాణానికి ఆయన చేసిన కృషికి గుర్తింపుగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఈ బ్యారేజికి మేకపాటి గౌతమ్ రెడ్డి సంగం బ్యారేజి అని పేరు ప్రకటించడం జరిగిందని మంత్రి తెలిపారు. జలయజ్ణం కార్యక్రమాన్ని తీసుకోవచ్చి సాగునీటి ప్రొజెక్ట్స్ నిర్మాణాల ప్రధాత స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని, ఈ బ్యారేజి నిర్మాణానికి కృషి చేసిన ఈ ప్రాంత శాసన సభ్యులు, దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి విగ్రహాన్ని పెన్నా డెల్టా ఆధునీకరణలో భాగంగా ఈ బ్యారేజి నిర్మాణం వద్ద ఏర్పాటు చేసి, గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరుగుతుందని మంత్రి గోవర్ధన్ రెడ్డి తెలిపారు. జిల్లాలో ప్రతి పంటకు సాగు నీరు ఇవ్వడం జరుగుతుందని మంత్రి తెలిపారు.
