తిక్కన పార్కు ఆధునీకరణ పనులు పరిశీలించిన నగర ఎమ్మెల్యే అనీల్

Clock Of Nellore ( Nellore ) – నెల్లూరు నగరంలోని పెన్నానది తీరాన ఉన్న తిక్కన పార్కు ఆధునీకరణ పనులను నగర ఎమ్మెల్యే అనీల్ కుమార్ యాదవ్ ( Nellore Mla Anil Yadav ) సోమవారం సాయంత్రం పరిశీలించారు. 70 లక్షలతో చేపడుతున్న ఈ పనుల పురోగతిపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అలాగే పక్కనే ఉన్న పెన్నా బ్యారేజీని కూడా పరిశీలించారు. బ్యారేజీ ప్రారంభోత్సవం నాడే పార్కు కూడా ప్రారంభించే ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ ఖలీల్ అహ్మద్, కార్పొరేటర్ షేక్ అస్మ, కొణిదెల సుధీర్, కందుకూరి రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Read Previous

స్వగ్రామం తోడేరులో మంత్రి కాకాణి… స్థానికులతో కలిసి సహపంక్తి భోజనం

Read Next

బాధ్యతగా పనిచేద్ధాం… జిల్లాను అభివృద్ధి చేద్ధాం : సమీక్షలో మంత్రి కాకాణి

Leave a Reply

Your email address will not be published.