నెల్లూరులో మజ్జిగ చలివేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే అనీల్

Clock Of Nellore ( Nellore ) – నెల్లూరులోని చిన్నబజారులో ది నెల్లూరు ఆర్యవైశ్య బులియన్ మర్చంట్స్ అండ్ పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ నిర్వాహకులు ఏర్పాటు చేసిన మజ్జిగ చలివేంద్రాన్ని నగర ఎమ్మెల్యే ఆనీల్ కుమార్ యాదవ్ సోమవారం ప్రారంభించారు. వేసవి కాలాన్ని దృష్ఠిలో ఉంచుకుని ప్రజల కోసం మజ్జిగ చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం సంతోషకరమని, భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు మరిన్ని నిర్వహించాలని అనీల్ కోరారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ ఖలీల్ అహ్మద్, కార్పొరేటర్లు పోట్లూరి రామకృష్ణ ఆచారి, వేలూరు మహేష్, అసోసియేషన్ సభ్యులు అమరా మోహన్ రావు, మట్టా ప్రసన్నాంజనేయులు, శోభన్ బాబు, వినయ్ కుమార్ పాల్గొన్నారు.

Read Previous

బులియన్ అండ్ డైమండ్ మర్చంట్స్ అసోసియేషన్ కార్యదర్శిగా ఆర్కాట్

Read Next

స్వగ్రామం తోడేరులో మంత్రి కాకాణి… స్థానికులతో కలిసి సహపంక్తి భోజనం

Leave a Reply

Your email address will not be published.