ప్రతీ కార్యకర్తకు అండగా ఉంటా… ఆనం సమక్షంలో పలువురు వైసీపిలో చేరిక

Clock Of Nellore ( Nellore ) – తనతో పాటూ కలిసి నడిచే ప్రతీ కార్యకర్తకూ అండగా ఉంటానని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఆనం విజయకుమార్ రెడ్డి హామీ ఇచ్చారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని కనుపర్తిపాడుకు చెందిన సుమారు 100 మంది టిడిపి కార్యకర్తలు వైసీపిలో చేరారు. వారందరికీ ఆనం విజయకుమార్ రెడ్డి, జిల్లా పరిషత్ ఛైర్ – పర్సన్ ఆనం అరుణమ్మలు కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ముందుగా కనుపర్తిపాడుకు చెందిన నేతలు సుధాకర్, సత్య, విజయ, సునీల్, నగేష్, మీరమ్మ, దేవసేనమ్మ, సంపూర్ణ తదితరులు ఆనం విజయకుమార్ రెడ్డి, ఆనం అరుణమ్మ దంపతులను ఘనంగా సత్కరించారు. అనంతరం ఆనం విజయకుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ వైసీపిని మరింత బలోపేతం చేసేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తామని అన్నారు. తమను నమ్మి తమ వెంట వచ్చే కార్యకర్తలకు అన్నీ విధాలా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. నిత్యం కార్యకర్తలకు అందుబాటులో ఉంటామన్నారు.

 

Read Previous

మేకపాటి విక్రమ్ రెడ్డి రాజకీయ ఆరంగేట్రం… ఆత్మకూరు ఉప ఎన్నికల్లో పోటీ

Read Next

ఇకపై మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి… కొత్త కేబినెట్ లో చోటు

Leave a Reply

Your email address will not be published.