కుంటుతూ కాదు… కులాసాగా నడవండిక : 50 % రాయితీతో నారాయణలో చికిత్స

Clock Of Nellore ( Nellore ) – నెల్లూరు నారాయణ హాస్పిటల్ లో 50 % రాయితీతో మోకీళ్ల ఆపరేషన్లతో పాటూ దానికి సంభందించిన అన్నీ చికిత్సలు అందిస్తున్నట్లు హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ బి. హరి ప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. ఈనెల 11వ తేదీ నుండి మే 10వ తేదీ వరకూ ఈ ప్రత్యేక ప్యాకేజీ వర్తిస్తుందని వెల్లడించారు. ఆర్ధోపెడిక్స్ విభాగ అధిపతి డాక్టర్ బిబు రవీంద్రన్, హాస్పిటల్ ఏజిఎం సిహెచ్. భాస్కర్ రెడ్డితో కలిసి హరి ప్రసాద్ రెడ్డి ఈ స్పెషల్ ప్యాకేజీకి సంభందించిన బ్రోచర్ ను హాస్పిటల్ లో ఆవిష్కరించారు. ( Nellore Narayana Hospital ) అనంతరం డాక్టర్ హరి ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ మోకీళ్ల నొప్పులు, చికిత్సా విధానాలపై నిపుణులైన జాయింట్ రీ ప్లేస్ మెంట్, ఆర్ధో సర్జన్ల బృందంచే ఈ నెల రోజుల పాటూ మోకీళ్ల క్లినిక్ ఏర్పాటు చేశామన్నారు. మారిన జీవన విధానాల కారణంగా 40 ఏళ్లకే అనేక మంది మోకీళ్ల నొప్పుల కారణంగా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయించుకుంటున్నారని చెప్పారు.

మోకీళ్ల వ్యాధిని ప్రాధమిక దశలోనే గుర్తించి సరైన చికిత్స చేయించుకుంటే వ్యాధి పూర్తిగా నయమయ్యే అవకాశం ఉందని అన్నారు. వ్యాధిని ప్రాధమిక దశలో గుర్తించాలనే ప్రధాన ఉద్దేశ్యంతో ఈ నెల రోజుల స్పెషల్ క్యాంపు ఏర్పాటు చేశామన్నారు. నెల రోజుల పాటూ నిర్వహించే ఈ స్పెషల్ క్యాంపులో జాయింట్ రీ ప్లేస్ మెంట్ సర్జన్ల పర్యవేక్షణలో డాక్టర్ కన్సల్టేషన్, డిజిటల్ ఎక్స్ రే ఉచితంగా చేస్తామని డాక్టర్ హరిప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. రోగి అవసరాన్ని బట్టి 12 వందల రూపాయల విలువైన వైద్య పరీక్షలు కేవలం 499 రూపాయలకే చేయడం జరుగుతుందన్నారు. మోకీళ్ల అరుగుదలను బట్టి వారికి తదుపరి చికిత్సలు అయిన జాయింట్స్ లూబ్రికేషన్, నొప్పి నుంచి ఉపశమం కలిగించే విస్కో సప్లిమెంటేషన్ ఇంజక్షన్, మోకీళ్ల ఇంజక్షన్ వేసేందుకు అవసరమైన పరీక్షలు, ఆపరేషన్ థియేటర్ ఛార్జీలు మొత్తం 20వేలు అవుతాయని, వాటిని 50 % రాయితీతో అంటే 10వేల రూపాయలకే అందిస్తామని వెల్లడించారు. మోకీళ్ల మార్పిడి ఆపరేషన్ కూడా 50 % రాయితీతో చేస్తామన్నారు. హెల్త్ ఇన్సూరెన్స్, ఈహెచ్ ఎస్ కార్డు ఉన్న వారికి కన్సల్టేషన్, శస్త్రచికిత్సలు పూర్తిగా ఉచితంగా చేయబడటం జరుగుతుందని డాక్టర్ హరిప్రసాద్ రెడ్డి తెలియజేశారు.

ఈ స్పెషల్ ప్యాకేజీ కోసం నారాయణ హాస్పిటల్ ఓపి విభాగం రెండో అంతస్తులో ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకూ ఆర్దో విభాగంలో సంప్రదించాలని, అపాంట్ మెంట్ కొరకు 73311 70063 నంబరును కూడా సంప్రదించవచ్చునని హాస్పిటల్ ఏజిఎం సి.హెచ్. భాస్కర్ రెడ్డి తెలియజేశారు. ఈ అవకాశాన్ని రోగులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Read Previous

ఏపిని శ్రీలంకతో పోలుస్తారా… ఆనం ఆగ్రహం…

Read Next

11 నుంచి 9 నెలల పాటూ ప్రజల్లోనే : మంత్రి రేసులో ఉన్నానన్న ఎమ్మెల్యే కోటంరెడ్డి

Leave a Reply

Your email address will not be published.