Clock Of Nellore ( Buero Report ) – మంత్రి వర్గ పునర్ వ్యవస్థీకరణపై కసరత్తును ముమ్మరం చేశారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. కొత్త పాత కలయికతో కొత్త కేబినెట్ ఉంటుందని ఇప్పటికే ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. మరో వైపు కొన్ని జిల్లాలకు సంభందించి అభ్యర్ధుల ఎంపికను ఇప్పటికే పూర్తి చేశారు. నెల్లూరు జిల్లాకు సంభందించి సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి ( Kakani Govardhan Reddy ) పేరు ఖరారైనట్లు విశ్వసనీయంగా తెలిసింది. వాస్తవానికి కాకాణి గోవర్ధన్ రెడ్డి… వైపీసి అధికారంలోకి వచ్చిన తొలి కేబినెట్ లోనే మంత్రి కావల్సి ఉండగా చివరి నిముషంలో చేజారింది. దీంతో ఆయనకు సిఎం జగన్.. అసెంబ్లీ ప్రివిలేట్ కమిటి ఛైర్మైన్ పదవిని ఇచ్చారు. తాజాగా నెల్లూరుజిల్లా నుండి కాకాణి గోవర్ధన్ రెడ్డికి మంత్రిత్వం ఖరారు చేశారని పక్కా సమాచారం.
ఇక తిరుపతి జిల్లాకు సంభందించి సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య ( Kiliveti Sanjeevaiah )పేరు ఖరారయింది. తిరుపతి నియోజకవర్గంలో సీనియర్లుగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి ఉన్నా… ఎస్సీ కోటాలో కిలివేటి సంజీవయ్యకు అవకాశం లభించింది. సంజీవయ్య టిటిడి బోర్డు మెంబర్ గా కూడా ఉన్నారు. చిత్తూరు జిల్లా విషయానికొస్తే నగరి ఎమ్మెల్యే ఆర్.కె. రోజా ( RK Roja )పేరు ఖరారయింది. ఈ జిల్లాలో కూడా సీనియర్లు చాలా మంది ఉన్నా… పార్టీ కోసం రోజా చేసిన పనితీరు, గత కేబినెట్ లో అవకాశం ఇవ్వలేక పోవడం తదితర విషయాలను పరిగణలోకి తీసుకున్న సిఎం జగన్… రోజాను ఎంపిక చేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది. వీరంతా ఈనెల 11వ తేదీనా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇప్పటి వరకూ ఉన్న సమాచారం మేరకు వీరిని ఎంపిక చేసినట్లు తెలిసింది. రేపటికి మళ్లీ పరిస్థితులు ఏమైనా మారుతాయ అనేది తెలియదు. ఈ మూడు జిల్లాలకు సంభందించి ఈ ముగ్గురు దాదాపుగా ఖరారే అని చెప్పాలి.