కందుకూరులో ఎస్పీ విజయరావు… పోలీస్ స్టేషన్ల తనిఖీ

Clock Of Nellore ( kandukuru ) – జిల్లాల పునర్విభజనలో భాగంగా నెల్లూరుజిల్లాలో కలిసిన కందుకూరు నియోజకవర్గంలో నెల్లూరు జిల్లా ఎస్పీ విజయరావు పర్యటించారు. కందుకూరు డిఎస్పీ కార్యాలయంతో పాటూ సిఐ కార్యాలయాన్ని అదనపు ఎస్పీ వెంకటరత్నంతో కలిసి సందర్శించారు. తనిఖీకి వెళ్లిన ఎస్పీకి కందుకూరు పోలీసులు పుష్ప గుచ్చాలతో స్వాగతం పలికారు. స్టేషన్ మ్యాప్స్, నేర ప్రాంతాలు, భవనాలను ఎస్పీ పరిశీలించారు. శాంతి భద్రతల పరిరక్షణ, మహిళా సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలని ఎస్పీ అధికారులకు సూచించారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ అమలు చేయడంతో పాటూ దిశ పెట్రోలింగ్ వ్యవస్థను ముమ్మరం చేయాలని ఆదేశించారు. పాఠశాలలు, కళాశాలల్లో దిశ చట్టంపై విస్త్రృత ప్రచారం చేయాలన్నారు. కొత్తగా నెల్లూరుజిల్లాలో కలిసిన నేపద్యంలో పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని ఎస్పీ పోలీసు అధికారులు, సిబ్బందికి భరోసా ఇచ్చారు.

 

Read Previous

ఈనెల 27న ఉప రాష్ట్రపతి నెల్లూరు పర్యటన… ఏర్పాట్లు పర్యవేక్షించిన కలెక్టర్

Read Next

పన్నులు చెల్లిస్తే 5 శాతం రాయితీ – కమిషనర్ జాహ్నవి ప్రకటన

Leave a Reply

Your email address will not be published.