Clock Of Nellore ( Nellore Rural ) – నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గురువారం నియోజకవర్గ పరిధిలోని పలు గ్రామాల్లో సుడిగాలి పర్యటన చేశారు. ఈ ఒక్క రోజే 14 గ్రామాలకు వెళ్లి సచివాలయాలను సందర్శించారు. గొల్ల కందుకూరు,సజ్జాపురం, పాత వెల్లంటి, కొత్త వెల్లంటి, కందమూరు, ఉప్పుటూరు, సౌత్ మోపూరు, ఆమంచర్ల, ములుమూడి, దేవరపాలెం, కొమరిపూడి, పొట్టేపాలెం, కొండ్లపూడి గ్రామాల్లోని సచివాలయాలకు వెళ్లి వాలంటీర్లతో సమావేశమయ్యారు. వాలంటీర్ల సేవలను కొనియాడారు. సచివాలయాల్లో ఉత్తమ ప్రతిభను కనబర్చిన వాలంటీర్లను సన్మానించి పురస్కారాలు అందించారు. ఈ కార్యక్రమాల్లో నెల్లూరు రూరల్ మండల పరిషత్ అధ్యక్షులు బూడిద విజయకుమార్, జిల్లా పరిషత్ కో – ఆప్షన్ సభ్యులు అల్లాబక్షు, నరసింహస్వామి దేవస్థానం ఛైర్మైన్ వేమిరెడ్డి సురేందర్ రెడ్డి, నెల్లూరు రూరల్ వైసీపి కన్వీనర్ ఇందుపూరు శ్రీనివాస రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
