Clock Of Nellore ( Nellore ) – నెల్లూరుకు విచ్చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో మాజీ మంత్రి, వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామ నారాయణరెడ్డి పలు అంశాలపై చర్చించారు. నగరంలోని పోలీసు కవాతు మైదానంలో హెలిప్యాడ్ వద్ద సోమశిల – స్వర్ణముఖి లింక్ కెనాల్ పనుల పునరుద్ధరణ, నూతన జిల్లాల పునర్విభజన ప్రక్రియలో భాగంగా కలువాయి, రాపూరు, సైదాపురం మండలాలను నెల్లూరుజిల్లాలోన కొనసాగించాలని ఆనం రామనారాయణరెడ్డి ముఖ్యమంత్రి కోరగా సిఎం సానుకూలంగా స్పందించినట్లు ఆనం కార్యాలయం తెలిపింది.
