నాయకులతో కలిసి ‘ఆర్​ఆర్​ఆర్’ సినిమా చూసిన ఎమ్మెల్యే…

Clock Of Nellore ( Nellore ) – దర్శకధీరుడు రాజమౌళి, అగ్ర హీరోలు ఎన్టీఆర్, రామ్​చరణ్ కాంబోలో వచ్చిన ‘ఆర్​ఆర్​ఆర్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీ సృష్టిస్తోంది. భారీ బడ్జెట్, అంచనాలతో శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం విశేష ప్రేక్షకాదరణ పొందుతోంది. అభిమానులతోపాటు రాజకీయ పార్టీల నేతలు ఈ సినిమా చూసేందుకు ఆసక్తి చూపుతున్నారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డితో సహా పలువురు కార్పొరేటర్లు, వైసీపి ముఖ్య నాయకులు ఇవాళ ‘ఆర్​ఆర్​ఆర్’ చిత్రాన్ని తిలకించారు. నగరంలోని ఎం.జీ. మాల్​లో ఎమ్మెల్యేతోపాటు దాదాపు 70 మంది ప్రజాప్రతినిధులు మూవీని తిలకించటంతో థియేటర్​లో సందడి నెలకొంది. ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డికి తరచుగా సినిమాలు చూసే అలవాటు ఉంది. అన్నీ సినిమాలు చూడరు గానీ… ప్రత్యేకత కలిగిన సినిమాలను థియేటర్ లోనే చూస్తారు. గతంలో కూడా జార్జిరెడ్డి సినిమాను చూశారు.

Read Previous

నెల్లూరులో జడ్పీ సర్వసభ్య సమావేశం – సమస్యలపై సభ్యుల ప్రసంగం

Read Next

విద్యార్ధి మిస్భా ఆత్మహత్య దోషులను శిక్షించండి : నెల్లూరులో టిడిపి నిరసన

Leave a Reply

Your email address will not be published.