ప్రభుత్వ పథకాలు ప్రతీ ఇంటికీ చేరాలి… వాలంటీర్లకు కోటంరెడ్డి సూచన

Clock Of Nellore ( Nellore Rural ) – అర్హత కలిగిన ప్రతీ ఇంటికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి సచివాలయ సిబ్బంది, వాలంటీర్లకు సూచించారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని కందమూరు, ములుమూడి, కొమ్మరపూడి సచివాలయ సిబ్బంది, వాలంటీర్లతో ఆయన శనివారం సమావేశమయ్యారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేసిన సచివాలయ వ్యవస్థను మరింత బలోపేతం చేసి ప్రజలకు సేవలు అందించాలన్నారు. ప్రజలకు అవసరమైన అన్నీ పనులు సచివాలయాల్లోనే పూర్తయ్యేలా పని చేయాలని కోరారు. అర్హత ఉన్న ప్రతీ కుటుంబానికి సంక్షేమ పథకాలు వారి ఇంటి ముంగిటకే చేర్చి ప్రభుత్వానికి మంచిపేరు తీసుకురావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు రూరల్ మండల వైసీపి కన్వీనర్ ఇందుపూరు శ్రీనివాసులు రెడ్డి, నెల్లూరు రూరల్ మండల కో – ఆప్షన్ సభ్యులు మీరా మొహిద్దీన్, సర్పంచ్ లు, ఉప సర్పంచ్ లు, ఎంపిటిసి సభ్యులు పాల్గొన్నారు.

Read Previous

నెల్లూరులో ఉద్రిక్తమైన SFI ఛలో కలెక్టరేట్… విద్యార్ధుల అరెస్ట్

Read Next

పన్నుల వసూళ్లు వేగవంతం చేయండి – రెవెన్యూ సిబ్బందిపై కమిషనర్ ఆగ్రహం

Leave a Reply

Your email address will not be published.