Clock Of Nellore ( Nellore Rural ) – నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని సౌత్ మోపూరు గ్రామంలో వైసీపి రాష్ట్ర కార్యదర్శి, డిసిసిబి మాజీ ఛైర్మైన్ ఆనం విజయ కుమార్ రెడ్డి, జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ ఆనం అరుణమ్మకు స్థానిక ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అక్కడి పర్యటనకు వెళ్లిన వారిని ప్రజలు ఘనంగా స్వాగతించారు. అధికారులతో కలిసి వెళ్లిన జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ స్థానిక సమస్యలను అడిగి తెలుసుకుని అక్కడికక్కడే పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు. స్థానికులు భారీ ఊరేగింపుగా వారిని గ్రామానికి తీసుకెళ్లి విశేష అతిథ మిచ్చారు.
అనంతరం అక్కడ జరిగిన సమావేశంలో జిల్లా పరిషత్ చైర్ – పర్సన్ ఆనం అరుణమ్మ మాట్లాడుతూ ప్రతీ రోజూ జిల్లా పరిషత్ కార్యాలయంలో తాను ప్రజలకు అందుబాటులో ఉంటానని… ఏ సమస్యలు ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని కోరారు. రాజకీయ పార్టీలతో పనిలేకుండా ప్రజలకు పనిచేయడం ఆనం కుటుంబం స్వభావమని స్పష్టం చేశారు. స్థానికంగా ఉన్న సమస్యలను జిల్లా పరిషత్ నిధులు ద్వారా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.

