Clock Of Nellore ( Nellore ) – నిడిగుంటపాళెం జిల్లా పరిషత్ హైస్కూల్ లో 9వ తరగతి చదువుతున్న ఎన్. ఝాన్సీ అనే విద్యార్ధిని రాష్ట్ర స్థాయి సైన్స్ ఫేర్ ఎంపికైంది. గడ ఏడాది డిసెంబర్ లో వర్చువల్ విధానంలో జరిగిన జిల్లా స్థాయి సైన్స్ ఫేర్ లో విభిన్నమైన నమూనాతో అద్భుతమైన ప్రతిభను కనబర్చిన ఝాన్సీ… తాజాగా రాష్ట్ర స్థాయి పోటీలను ఎంపికైంది. ఈ సందర్భంగా శుక్రవారం నెల్లూరులో ఝాన్సీని జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు అభినందించారు. ఈ కార్యక్రమంలో హైస్కూల్ సైన్స్ ఉపాధ్యాయులు ప్రసాద్ కూడా పాల్గొన్నారు.