ఉక్రెయిన్ లో 12 మంది నెల్లూరు విద్యార్ధులు… ఆందోళనలో తల్లిదండ్రులు

Clock Of Nellore ( Nellore ) – ఉక్రెయిన్ పై రష్యా చేస్తున్న యుద్ధం నేపద్యంలో అక్కడున్న తెలుగు వారి యోగక్షేమాలపై వారి వారి కుటుంబాల్లో ఆందోళన నెలకొంది. నెల్లూరుజిల్లాకు సంభందించి 12 మంది వైద్య విద్యార్ధులు ఉక్రెయిన్ లో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. జిల్లాకు చెందిన వీరంతా ఉక్రెయిన్ లో వైద్య విద్యను అభ్యసిస్తున్నారు. భయం గుప్పిట్లో ప్రస్తుతానికి క్షేమంగానే ఉన్నట్లు విద్యార్ధులు నెల్లూరులోని వారి తల్లిదండ్రులకు వీడియో కాల్ ద్వారా తెలియజేసినప్పటికీ వారిలో ఆందోళన మాత్రం తగ్గడం లేదు. అసలు నెల్లూరు జిల్లాకు సంభందించిన వారు ఉక్రెయిన్ ఎంత మంది ఉన్నారో జిల్లా కలెక్టర్, ఎస్పీ వివరాలను సేకరించారు.

నెల్లూరు నగరంలోని హరనాథపురంకు చెందిన విశాల్, రవీంద్రనగర్ కు చెందిన తబుస్సం, నేతాజీ నగర్ కు చెందిన శ్యామంత్, కొండాయపాళెం కు చెందిన వరలక్ష్మి, అదే ప్రాంతానికి చెందిన శ్రీ చైతన్య తేజ, వెంకటాచలం మండలం, ఇస్కపల్లికి చెందిన సాయి సుధాకర్ రెడ్డి, వింజమూరు టీచర్స్ కాలనీకి చెందిన నరసింహ తేజ, అనంతసాగరం మండలం, సంజీవ్ నగర్ చెందిన గంగినేని జశ్వంత్, కావలి జనతాపేటకు చెందిన జ్వాలా భానుమతి అనే విద్యార్ధులు ఉక్రెయిన్ లో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వారి సమాచారం మొత్తం సేకరించి రాష్ట్ర ప్రభుత్వానికి పంపుతున్నారు. మరో వైపు భారత ప్రభుత్వం ఉక్రెయిన్ లో ఉన్న భారతీయులను సురక్షితంగా తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తుంది.

Read Previous

న్యాక్ గుర్తింపు కోసం వి.ఎస్.యు ప్రయత్నాలు… వెల్లడించిన వైస్ – ఛాన్సలర్

Read Next

రాష్ట్ర స్థాయి సైన్స్ ఫేర్ కు జడ్పీ విద్యార్ధిని… అభినందించిన కలెక్టర్

Leave a Reply

Your email address will not be published.