కువైట్ లో ఏపి వాసికి చిత్రహింసలు… క్షేమంగా స్వదేశానికి చేర్చిన APNRTS

Clock Of Nellore ( Kuwait ) – ఉపాధి కోసం కువైట్ వెళ్లిన ఓ యువకుడు అక్కడ చిత్రహింసలకు గురయ్యాడు. కువైట్ లో పని చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్న యజమాని జీతం ఇవ్వకపోగా నానా ఇబ్బందులు పెట్టాడు. 9 నెలలుగా నరకాన్ని అనుభవిస్తున్న ఆ యువకుణ్ని కాపాడి క్షేమంగా స్వదేశానికి పంపింది ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవాస ఆంధ్రుల కోసం ఏర్పాటు చేసిన ఈ సొసైటీ ఎందరినో కాపాడుతుంది.

రాష్ట్రంలోని తూర్పు గోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలం, అంతర్వేది గ్రామానికి చెందిన పోతురాజు నాగరాజు అనే యువకుడు 9 నెలల క్రితం ఉపాధి కోసం కువైట్ కు వెళ్లారు. అయితే అక్కడి యజమాని పనిచేయించుకుంటూ జీతం ఇవ్వకపోగా అడిగిన నాగరాజును చిత్రహింసలకు గురి చేస్తుండేవాడు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటి ( APNRTS ) గురించి తెలుసుకున్న నాగరాజు హెల్ప్ లైన్ కు ఫోన్ చేసి తాను పడుతున్న ఇబ్బందులను వివరించాడు. దీనిపై స్పందించిన కువైట్ లోని APNRTS రీజనల్ కో – ఆర్డినేటర్ మహేశ్వర రెడ్డి వెంటనే నాగరాజు ఉంటున్న ప్రదేశానికి వెళ్లి అతన్ని అక్కడి నుండి తీసుకొచ్చాడు. స్థానికంగా రెండు నెలల పాటూ వసతి సౌకర్యాన్ని కల్పించారు.

తాజాగా భారత రాయబార కార్యాలయ అధికారులతో మాట్లాడి ఇండియా పంపించే ఏర్పాట్లు చేశారు. ప్రయాణ ఖర్చుల కోసం కువైట్ లోని తెలుగు సేవా సమితి 5 వేల రూపాయలు, కో – ఆర్డినేటర్ మహేశ్వర్ రెడ్డి 2వేల రూపాయలు ఇచ్చి బుధవారం నాగరాజును కువైట్ నుండి ఇండియాకు పంపారు. గురువారం నాగరాజు స్వస్థలమైన తూర్పు గోదావరికి చేరుకున్నాడు. దీనిపై నాగరాజు మాట్లాడుతూ తాను ఇండియాకు క్షేమంగా వచ్చేందుకు కారణమైన ముఖ్యమంత్రి జగన్ కు, APNRTS ఛైర్మైన్ మేడపాటి వెంకట్, సిఈఓ దినేష్ కుమార్, APNRTS డైరెక్టర్ బి.హెచ్. ఇలియాజ్, వైసీపి కువైట్ కన్వీనర్ ముమ్మడి బాలిరెడ్డి, నాయిని మహేశ్వర్ రెడ్డిలకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ వార్తకు సంభందిన వివరాలను వైసీపి గల్ఫ్ మీడియా కో- ఆర్డినేటర్ షేక్ గౌస్ బాషా మీడియాకు విడుదల చేశారు.

Read Previous

గూడూరును నెల్లూరులోనే ఉంచండి… పాశం సునీల్ ఆధ్వర్యంలో నిరసన

Read Next

స్పందన అర్జీల పరిష్కారంపై కలెక్టర్ సమీక్ష… హాజరైన ఆర్డీఓలు

Leave a Reply

Your email address will not be published.