గడువులోగా సమస్యల పరిష్కారం… అర్జీలు స్వీకరించిన కలెక్టర్

Clock Of Nellore ( Nellore ) – జిల్లాలో పెండింగ్ లో ఉన్న స్పందన అర్జీలను నిర్ధేశించిన గడువులోగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు అధికారులను ఆదేశించారు. సోమవారం నగరంలోని కలెక్టరేట్ తిక్కన ప్రాంగణంలో జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు స్పందన కార్యక్రమం నిర్వహించి పలు సమస్యలపై వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, స్పందన అర్జీల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఖచ్చితంగా నిర్ధేశిత గడువులోగా అర్జీల పరిష్కారానికి ప్రత్యేక శ్రద్ధ వహించాలని, గడువు దాటి ఉండరాదని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆర్మీ లో సేవలందిస్తున్న వారి కుటుంబాల ఆర్థిక సహాయ నిమిత్తం ఆర్మీ నిధి కి నెల్లూరు జిల్లా కెమిస్ట్ అండ్ డ్రగిస్ట్ అసోసియేషన్ తరఫున డ్రగ్ కంట్రోల్ సహాయ సంచాలకులు వీర కుమార్ రెడ్డి 1,03,080/- రూపాయల చెక్కును జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబుకు అందజేశారు. ఈ సందర్భంగా అసోసియేషన్ సభ్యులను జిల్లా కలెక్టర్ అభినందించారు.

Read Previous

విద్యార్ధులకు ఉపయోగకరంగా గ్రంధాలయాలు… ఛైర్ – పర్సన్ శారద వెల్లడి

Read Next

డిజిటల్ నగదు లావాదేవీల్లో అప్రమత్తంగా ఉండండి… హెచ్చరించిన కలెక్టర్

Leave a Reply

Your email address will not be published.