Clock Of Nellore ( Nellore ) – కాపు సంక్షేమ సేన నెల్లూరుజిల్లా రైతు విభాగం అధ్యక్షునిగా నెల్లూరు నగరానికి చెందిన వెలిశెట్టి కేవశరావు నియమితులైనారు. సేన వ్యవస్థాపక అధ్యక్షులు చేగొండి హరిరామ జోగయ్య ఈ మేరకు పత్రికా ప్రకటనను విడుదల చేశారు. రాష్ట్ర కాపు సంక్షేమ సేన ఎగ్జిక్యూటివ్ కమిటీ తీర్మానం ప్రకారం కేశవరావును నియమించినట్లు పేర్కొన్నారు. సంస్థ ఆశయాలు, అభిలాష మేరకు అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వహించి అందరి మన్ననలు పొందాలని సూచించారు. మరో వైపు తనను రైతు విభాగం జిల్లా అధ్యక్షునిగా నియమించినందుకు హరిరామ జోగయ్యకు ధన్యవాదాలు తెలియజేశారు కేశవరావు.