Clock Of Nellore ( Nellore ) – నెల్లూరు బాలాజీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎన్‌ఐఏ అధికారుల సోదాలు నిర్వహించారు. మావోయిస్టులకు నిధుల సమీకరణ కేసులో ఈ సోదాలు చేస్తున్నారు. ఏపీ, ఒడిశా, బిహార్, ఝార్ఖండ్‌లోని 26 ప్రాంతాల్లో ఎన్ఐఏ బృందాలు ఆరా తీస్తున్నాయి. బిహార్‌లో ఇటీవల నమోదైన కేసు ఆధారంగా ఎన్‌ఐఏ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.