ప్రాణం తీసిన సరదా… మైపాడు బీచ్ లో విద్యార్ధి మృత్యువాత

Clock Of Nellore ( Mypadu ) – ఈత సరదా ఓ విద్యార్ధి ప్రాణాన్ని బలిగొంది. నెల్లూరుజిల్లా మైపాడు బీచ్ లో ఈత కొట్టేందుకు సముద్రంలోకి దిగిన ఓ విద్యార్ధి అలల్లో కొట్టుకుపోవడంతో మృత్యువాత పడ్డాడు. గంగవరం గ్రామానికి చెందిన ఇంటర్ రెండో సంవత్సరం విద్యార్ధి అజీజ్ శనివారం మధ్యాహ్నం స్నేహితులతో కలిసి మైపాడు బీచ్ కు వెళ్లాడు. ఈత కొట్టేందుకు సముద్రంలో దిగగా అలలకు లోపలకు కొట్టుకుపోయాడు. స్నేహితులు కాపాడే ప్రయత్నం చేసినా వీలు పడలేదు. స్థానిక మత్స్యకారులు అజీజ్ ను బయటకు తీసుకురాగా అప్పటికే మృతి చెందాడు. ఇందుకూరుపేట పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read Previous

ప్రవాసాంధ్రులకు అండగా నిలుస్తున్న APNRTS… స్వస్థలానికి చేరిన శ్రీనివాస్

Read Next

రాజరాజేశ్వరి దేవస్థానం ఛైర్మైన్ కు ఆర్కాట్ శ్రీను ఘన సన్మానం…

Leave a Reply

Your email address will not be published.