Clock Of Nellore ( Nellore ) – విద్యుత్ రంగాన్ని మొత్తాన్ని ప్రైవేట్ పరం చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని సీపీఎం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు బి.వి. రాఘవులు ఆరోపించారు. గురువారం ఆయన నెల్లూరులోని సిపిఎం పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. నాసిరకం బొగ్గు సరఫరా చేసినవారిపై చర్యలు తీసుకోవాలన్నారు. వ్యవసాయ రంగం కుదేలవడానికి బీజేపీ సర్కారే కారణమన్నారు. కేంద్రాన్ని రాష్ట్రాలు ప్రశ్నించాలన్నారు. కేంద్రాన్ని ప్రశ్నించే పరిస్థితి ఏపీ ప్రభుత్వానికి లేదని రాఘవులు పేర్కొన్నారు. నెల్లూరులోని ఏపి జెన్ కో థర్మల్ పవర్ ప్రాజెక్టును ప్రైవేటు పరం చేసేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తుందని ఆ ప్రయత్నాలను సిపిఎం అడ్డుకుంటుందని హెచ్చరించారు.