పూర్తయిన గణేష్ నిమజ్జన ఘాట్ పనులు : ప్రారంభించిన వేమిరెడ్డి, కోటంరెడ్డి

Clock Of Nellore ( Nellore ) – నెల్లూరు ఇరుకళల పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం వద్ద నెల్లూరు చెరువు గట్టున నూతనంగా ఏర్పాటు చేసిన గణేష్ నిమజ్జన ఘాట్ పనులు పూర్తయ్యాయి. సకల సౌకర్యాలతో ఏర్పాటైన ఈ ఘాట్ ను మంగళవారం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డితో కలిసి రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రారంభించారు. గణేష్ నిమజ్జనాలకు నెల్లూరు నగర ప్రజలంతా ఈ ఘాట్ ను వినియోగించుకోవాలని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కోరారు. రానున్న రోజుల్లో ఈ ఘాట్ ను మరింత సుందరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామన్నారు. అన్నీ శాఖల అధికారులను సమన్వయం చేసుకుని, ఘాట్ ఇంత సుందరంగా నిర్మాణమయ్యేందుకు నిరంతరం శ్రమించిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి వేమిరెడ్డి అభినందనలు తెలియజేశారు. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ గణేష్ విగ్రహాల ఏర్పాటు విషయంలో అధికారులు… భక్తులను ఎలాంటి ఇబ్బందులకు గురిచేయవద్దని, సింగిల్ విండో విధానాన్ని వారికి వివరించి సహకరించాలని కోరారు. నిమజ్జన ఘాట్ వద్ద చిన్నపాటి విగ్రహాల నిమజ్జనానికి బోట్ సౌకర్యం కల్పిస్తున్నామని, ఈ అవకాశాన్ని ప్రజలు ఉపయోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైసీపి రాష్ట్ర కార్యదర్శి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, నగర మేయర్ పొట్లూరి స్రవంతి, నుడా ఛైర్మైన్ ముక్కాల ద్వారకానాథ్, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, విజయ డైరీ ఛైర్మైన్ కొండ్రెడ్డి రంగారెడ్డి, నెల్లూరు కార్పొరేషన్ కమిషనర్ హరిత, వైసీపి నగర అధ్యక్షులు తాటి వెంకటేశ్వర్లు, స్థానిక కార్పొరేటర్ విజయ లక్ష్మి, మిద్దె మురళీకృష్ణ యాదవ్ పాల్గొన్నారు.

Read Previous

జగనన్న కాలనీ రిజిస్ట్రేషన్ లు వేగవంతం చేయండి : కమిషనర్ హరిత

Read Next

అనుమతుల విషయంలో కొర్రీలు పెట్టకండి – సింగిల్ విండో కేంద్రంలో ఎమ్మెల్యే కోటంరెడ్డి

Leave a Reply

Your email address will not be published.