గణేష్ విగ్రహాల ఏర్పాటుకు సింగింల్ విండో అనుమతి కేంద్రం – పరిశీలించిన మేయర్

Clock Of Nellore ( Nellore ) – ఈనెల 31వ తేదీ నుంచి జరగనున్న వినాయక చవితి ఉత్సవాలలో భాగంగా విగ్రహాల ఏర్పాటు, నిమజ్జనం కార్యక్రమాలకై ముందస్తు అనుమతులు తప్పనిసరి అని, కార్పొరేషన్ కార్యాలయంలో లో ఏర్పాటు చేసిన ప్రత్యేక అనుమతి కేంద్రంలో వివరాలు నమోదు చేసుకోవాలని నెల్లూరు నగర మేయర్ స్రవంతి పేర్కొన్నారు. కమీషనర్ హరితతో కలిసి కార్పొరేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన అనుమతుల కేంద్రాన్ని మేయర్ పరిశీలించారు. అనంతరం మేయర్, కమిషనర్ మాట్లాడుతూ నగర వ్యాప్తంగా వివిధ కూడళ్లలో ఏర్పాటు చేస్తున్న విగ్రహ ప్రతిష్టాపనకోసం కార్యాలయంలోని విజిటర్స్ లాంజ్ లో ఏర్పాటు చేసిన సింగిల్ విండో కేంద్రంలో అధికారుల వద్ద వివరాలు నమోదు చేసి అనుమతులు పొందాలని సూచించారు. ప్రత్యేక అనుమతుల కేంద్రం అధికారులుగా సంజయ్, రాజేశ్వరిలను నియమించినట్లు పేర్కొన్నారు.

Read Previous

12వ డివిజన్ ను అభివృద్ధి పథంలో నడిపిస్తా : మేయర్ స్రవంతి

Read Next

మట్టి గణపతిని పూజించి పర్యావరణాన్ని కాపాడుకుందాం : కేతంరెడ్డి

Leave a Reply

Your email address will not be published.