ఐటి అధికారులమని తుపాకీతో బెదిరించి 12 కిలోల బంగారు చోరీ యత్నం…

Clock Of Nellore ( Nellore ) – ఐటి అధికారుల పేరుతో కొంత మంది నకిలీ తుపాకీతో బెదిరించి భారీ చోరీకి యత్నించారు. ఆ సంఘటన నెల్లూరులో శుక్రవారం చోటుచేసుకుంది. AP 11 AB4446 నంబరు రిజిస్ట్రేషన్ ఉన్న ఇన్నోవా కారులో నెల్లూరు కాకార్లవీధికి వచ్చిన కొందరు దుండగులు లావణ్య జ్యూయలర్స్ షాపులోకి వెళ్లారు. తాము ఐటి అధికారులమంటూ యజమానికి నకిలీ తుపాకీ చూపించి షాపులో సోదాలు చేపట్టారు. షాపులో ఉన్న 12 కిలోల బంగారానికి బిల్లులు లేవంటూ దాన్ని స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేశారు. అప్రమత్తమైన యజమాని వారిని ప్రశ్నించగా 50 లక్షల నగదును డిమాండ్ చేశారు. యజమానికి అనుమానం వచ్చి అక్కడే ఉన్న స్థానికులను పిలిచి వారిని నిర్భందించి పోలీసులకు సమాచారం అందించారు. అప్పటికే వారిలో కొందరు పరారయినట్లు తెలుస్తోంది. సంతపేట సిఐ అన్వర్ బాషా షాపు వద్దకు చేరుకుని విచారించగా వారు నకిలీ అధికారులని తేలింది. దీంతో వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వాహనంతో పాటూ తుపాకీని కూడా స్వాధీనం చేసుకున్నారు.

Read Previous

రాష్ట్రంలో ఇకపై ప్లాస్టిక్ ఫ్లెక్సీల నిషేదం : నేటి నుండే అమలు

Read Next

జర్నలిస్టుల కోసం రేపు మెడికవర్ ఉచిత వైద్య శిభిరం…

Leave a Reply

Your email address will not be published.