చిట్టమూరులో దంపతులు అనుమానస్పద మృతి.. దర్యాప్తు చేస్తున్న పోలీసులు

Clock Of Nellore ( Chittamur ) – ఉమ్మడి నెల్లూరుజిల్లాలోని చిట్టమూరు మండలంలో భార్యా భర్త అనుమానస్పదంగా మృత్యువాత పడ్డారు. ఇది ప్రమాదమా, ఆత్మహత్యా లేదా హత్య అనే విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మండల పరిధిలోని గంగాయగుంట గిరిజన కాలనీకి చెందిన వెంకటేష్, వెంకట రమణమ్మ దంపతులు… మల్లాం పంచాయితీ పరిధిలోని కొక్కుపాళెంలో రొయ్యల చెరువు వద్ద కాపలా దారులుగా ఉంటున్నారు. ఏమైందో ఏమో గానీ సోమవారం ఉదయం దంపతులిద్దరూ రొయ్యల చెరువులో శవాలుగా కనిపించారు. భార్యా భర్త ఇద్దరూ చనిపోయి నీళ్లలో మృతదేహాలు బోర్లా దర్శనమిచ్చారు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. చిట్టమూరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు. అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read Previous

బారా షహీద్ దర్గాకు ముఖ ద్వారాలు : శంఖుస్థాపన చేసిన ఎమ్మెల్యే కోటంరెడ్డి

Read Next

ఉచిత పథకాలతో ఎస్సీ, ఎస్టీలకు తీరని అన్యాయం : కేతంరెడ్డి ఆరోపణ

Leave a Reply

Your email address will not be published.