Clock Of Nellore ( Nellore ) – నెల్లూరు 20వ డివిజన్ పరిధిలోని ఇస్కాన్ సిటీ వద్ద రోడ్డు నిర్మాణ పనులకు శంఖుస్థాపన చేశారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. గడప గడపకు మన ప్రభుత్వంలో భాగంగా ఆ ప్రాంతంలో పర్యటించిన ఎమ్మెల్యే స్థానికుల కోరిక మేయరు రోడ్డు నిర్మాణానికి హామీ ఇచ్చారు. హామీ నేపద్యంలో మంగళవారం నగర మేయర్ స్రవంతితో కలిసి రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే శంఖుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల సమయంలో మాత్రమే పార్టీలు, అజెండాలు అని ఎన్నికల తర్వాత అంతా అభివృద్దేనని స్పష్టం చేశారు. ప్రజల ఆకాంక్ష మేరకు నడుచుకుంటేనే మంచి పేరు వస్తుందని అన్నారు. రూరల్ నియోజకవర్గం శరవేగంగా విస్తరిస్తుందని, కొత్తగా అనేక కాలనీలు ఏర్పాటవుతున్నాయని చెప్పారు. కొత్తగా ఏర్పాటయ్యే కాలనీల అభివృద్దిపై ప్రత్యేక దృష్ఠి సారిస్తున్నట్లు కోటంరెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ చేజర్ల మహేష్, ఇరుకళల పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం ఛైర్మైన్ రావు శ్రీనివాస రావు, మాజీ కార్పొరేటర్ నూనె మల్లిఖార్జున యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
